శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2016 (09:03 IST)

సింహాల ముందు భార్యతో కలిసి ఫోజులిచ్చిన క్రికెటర్ ఎవరు? రూ.20 వేల ఫైన్!

ప్రముఖ ఇండియన్ క్రికెటర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన భార్యతో కలసి సింహాల సఫారీలోకి వెళ్లి సింహాలతో సెల్ఫీలు దిగి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అసలు విషయం ఏంటంటే... గిర్ నేషనల్ పార్క్ అండ్ సాం

ప్రముఖ ఇండియన్ క్రికెటర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన భార్యతో కలసి సింహాల సఫారీలోకి వెళ్లి సింహాలతో సెల్ఫీలు దిగి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అసలు విషయం ఏంటంటే... గిర్ నేషనల్ పార్క్ అండ్ సాంక్చ్యూరీ(జీఎన్పీఎస్)లోని లైన్ సఫారీకి తన భార్య స్నేహితులతో కలిసి వెళ్లారు. జిప్సీలో తిరుగుతూ సింహాలను చూసి ఎంజాయ్ చేశారు. అయితే, అలా వెళుతున్న క్రమంలో మధ్య జిప్సీని ఆపి దిగడమే కాకుండా కొన్ని సింహాలకు 10 నుంచి 13 మీటర్ల దూరంలో తన భార్యతో కలిసి కూర్చొని తాఫీగా నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. 
 
సెల్ఫీలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అయితే, తమ ఆనందం కోసం ఈ ఫొటో తీసుకున్నప్పటికీ వన్యప్రాణి సంరక్షణ చట్టానికి ఈ చర్య వ్యతిరేకం కావడంతో దీనిపై విచారణకు ఆదేశించారు. దీంతో అటవీ శాఖ అధికారులు జడేజాకు రూ.20 వేల అపరాధం విధించారు. ఈ ఫొటోలపై నెటిజన్ల విమర్శలను సైతం జడేజా పట్టించుకోలేదు. అంతేకాదు ఏం చేసుకుంటారో చేసుకోండంటూ జడేజా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సంఘటనపై విచారణ నివేదిక పెండింగ్‌లో ఉండగానే అటవీశాఖ ఈ జరిమానా విధించడం గమనార్హం.