సంబంధిత వార్తలు
- పాఠశాలకు పెద్ద కత్తి, చాకుతో వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు, పిల్లలు బెంబేలు, వీడియో
- సామాన్య భక్తురాలిలా అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అన్నాలెజినోవా
- జోహార్ ముద్రగడ అనే నినాదాలు మాని సీఎం జగన్ అంటారా?: ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శ
- ప్రేమ విఫలం, ఆత్మహత్య చేసుకున్న యువతి మృతదేహానికి తాళి కట్టమంటూ ప్రియుడి ఇంటి ముందు బైఠాయింపు
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
లార్డ్స్‌లో రోహిత్ శర్మ సెంచరీ.. తొలి భారత బ్యాటర్‌గా రికార్డు
భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాటర్ రోహిత్ శర్మ 84 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ ప్రతిష్ఠాత్మక మైదానంలో వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. వన్డే చరిత్రలోనే ఎక్కువ వయసులో (39 సంవత్సరాల 80 రోజులు) సెంచరీ సాధించిన భారత ఆటగాడిగానూ రోహిత్ నిలిచాడు.
ఇంగ్లండ్ గడ్డపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు (8) చేసిన పర్యాటక ప్లేయర్‌గానూ హిట్‌మ్యాన్ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ శతకం పూర్తి చేసుకోగానే లార్డ్స్ బాల్కనీలో ఉన్న భారత ఆటగాళ్లు, హెడ్ కోచ్ గంభీర్ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. 31 ఓవర్లకు భారత్ స్కోరు 206/1. రోహిత్ (102), కోహ్లీ (23) క్రీజులో ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది.
