గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

మాస్టర్ బ్లాస్టర్ ఆస్పత్రికి వైద్య పరికరాల విరాళం

మాస్టర్ బ్లాస్టర్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మరోమారు తన పెద్ద మనసును చాటుకున్నారు. ఆయన  అస్సోలంని ఓ ఆస్పత్రికి వైద్య పరికరాలను అందించారు. అసోంలోని ఛారిటబుల్‌ హాస్పిటల్‌కు వీటిని అందించారు. 
 
యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఉన్న సచిన్‌.. పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌, నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో అవసరమైన పరికరాలను కరీమ్‌ గంజ్‌ జిల్లాలోని మకుండా ఆస్పత్రికి విరాళంగా ఇచ్చాడు. 
 
టెండూల్కర్‌ ఫౌండేషన్‌ ద్వారా సచిన్‌ మధ్యప్రదేశ్‌లోని గిరిజన వర్గాలకు న్యూట్రిషన్‌ ఆహారం అందించడంతో పాటు విద్యను అందిస్తున్నాడు. ఆసుపత్రిలో వైద్య పరికరాలు అమరికతో ఈ ప్రాంతంలో నివసించే సుమారు 2వేల పేద కుటుంబాలవారు తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలను అందుకోనున్నారు.