1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 జులై 2025 (12:12 IST)

Saina Nehwal: కశ్యప్‌తో సైనా నెహ్వాల్ విడాకులు.. ఎన్నో తీపి గుర్తులున్నాయ్

Saina-Kashyap
భారత బ్యాడ్మింటన్ ఐకాన్ సైనా నెహ్వాల్ తన భర్త, సహ షట్లర్ కశ్యప్ పారుపల్లి నుండి విడిపోతున్నట్లు ప్రకటించింది. దశాబ్ద కాలంగా కలిసి ఉంటూ 2018లో వివాహం చేసుకున్న ఈ జంట, ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో సైనా పంచుకున్న హృదయపూర్వక ప్రకటన ద్వారా విడిపోవాలనే తమ నిర్ణయాన్ని ధృవీకరించారు. 
 
"జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశల్లోకి తీసుకెళుతుంది" అని సైనా తన పోస్ట్‌లో రాసింది. చాలా ఆలోచించి, పరిశీలించిన తర్వాత, కశ్యప్ పారుపల్లి, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము. జీవితంలో ముందుకు సాగడానికి ఉత్తమమైన మార్గం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ప్రశాంతతకు ప్రాధాన్యం ఇచ్చాం. గడిచిన క్షణాలకు నేను కృతజ్ఞురాలిని. కశ్యప్‌తో నాకు ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయి. ఇకపై మిత్రులుగా ఉంటాం. కశ్యప్‌కు తదుపరి ప్రయాణానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మా గోప్యతను అర్థం చేసుకుని, గౌరవించినందుకు ధన్యవాదాలు," అని సోషల్ మీడియాలో తెలిపింది. 
ఈ ప్రకటన క్రీడా అభిమానులను ఆశ్చర్యపరిచింది.
 
కాగా హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో కశ్యప్‌తో సైనా నెహ్వాల్‌కు పరిచయం ఏర్పడింది. తొలుత వీరి మధ్య ఏర్పడిన స్నేహం తర్వాత ప్రేమగా మారింది. కొన్నేళ్లపాటు ప్రేమించుకున్న వీరిద్దరూ 2018లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.