ఐసీసీ స్వతంత్ర ఛైర్మన్‌గా శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నిక
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాజీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ అంతర్జాతీయ క్రికెట్ మండలి ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఐసీసీ గురువారం విడుదల చేసి ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈయన ఐసీసీ తొలి స్వతంత్ర ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని ఆ ప్రకటనలో పేర్కొంది.
మంగళవారం బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న శశాంక్ ఐసీసీ అత్యున్నత పదవికి ఎంపిక కావడం గమనార్హం. ప్రస్తుత ఎన్నికతో ఆయన ఈ పదవిలో మరో రెండేళ్ల వరకూ కొనసాగుతారు. ఆయన ఛైర్మన్‌గా తక్షణం విధుల్లోకి వచ్చినట్టని కూడా ఐసీసీ ప్రకటించింది.
ఎన్నికైన తర్వాత శశాంక్ మాట్లాడుతూ.. ఐసీసీ ఛైర్మన్‌గా ఎంపిక కావడం తనకు లభించిన గౌరవమని, తనను ఎన్నుకున్న ఐసీసీ డైరెక్టర్లందరికీ కృతజ్ఞతలని తెలిపారు. ఇందుకోసం బీసీసీఐ పూర్తి సహాయ సహకారాలు అందించిందన్నారు.