శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 10 మే 2016 (19:00 IST)

బీసీసీఐ అధ్యక్ష పదవికి శశాంక్ మనోహర్ గుడ్‌బై.. రేసులో అనురాగ్ ఠాకూర్

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ పేరు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. భారత క్రికెట్‌ను శాసించిన క్యాబ్ మాజీ అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియా ఆకస్మిక మృతితో ఏడాది క్రితం బోర్డు అధ్యక్షుడిగా ఎంపికైన శశాంక్ మనోహర్, తక్కువ వ్యవధిలోనే బీసీసీఐలో ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. 
 
అయితే, లోధా క‌మిటీ సూచించిన సంస్కరణల అమ‌లుపై ప‌లుసార్లు బీసీసీఐని సుప్రీంకోర్టు నిలదీసింది. బీసీసీఐ ప్రత్యేక సంస్థ ఏం కాదనీ, రాజ్యాంగానికి లోబడే పని చేయాల్సి ఉంటుందంటూ ఘాటుగా కూడా వ్యాఖ్యానించింది. వీటన్నింటికి తోడు జూన్‌లో ఐసీసీ ఛైర్మన్ ప‌ద‌వికి పోటీ చేయాల‌ని శ‌శాంక్ మ‌నోహ‌ర్ భావిస్తున్నారు. ఇంకోవైపు లోధా కమిటీ తీర్పుపై ఆయన గుర్రుగా కూడా ఉన్నారు. వీటన్నింటినీ బేరీజు వేసిన ఆయన తన పదవికి రాజీనామా చేశారు.