Smriti mandhana: తెలుపు డ్రెస్‌లో దేవతలా మెరిసిపోతున్న స్మృతి మంధాన
Smriti mandhana
తాజా ఫోటోల్లో ఆమె ఉత్సాహంగా ఉండటం చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్మృతి మంధాన.. తెల్లటి వన్-పీస్ డ్రెస్‌లో ఎంతో అందంగా కనిపించింది. బుగ్గపై డింపుల్, ముఖంలో చిరునవ్వుతో ఉన్న ఆమె ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అలాగే క్రికెట్ మైదానంలో స్మృతి మంధాన సందడి మళ్లీ మొదలుకానుంది. డిసెంబర్ 21 నుండి భారత్, శ్రీలంక జట్ల మధ్య 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో స్మృతి కీలక పాత్ర పోషించనుంది. జనవరి 9 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభం కానుంది. ఇందులో స్మృతి మంధాన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు సారథ్యం వహించనుంది.
