మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 22 నవంబరు 2017 (12:28 IST)

భజ్జీకి సారీ చెప్పిన దాదా.. త్వరలోనే కలుస్తానన్న హర్భజన్

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ తన సహచర బౌలర్ హర్భజన్ సింగ్‌కు సారీ చెప్పాడు. బాలీవుడ్ నటి గీతా బస్రాను టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక పాప పుట్టింది. తాజాగా

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ తన సహచర బౌలర్ హర్భజన్ సింగ్‌కు సారీ చెప్పాడు. బాలీవుడ్ నటి గీతా బస్రాను టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక పాప పుట్టింది. తాజాగా తన భార్య, కుమార్తెలతో కలసి స్వర్ణ దేవాలయం వద్ద దిగిన ఫొటోను భజ్జీ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశాడు. 
 
ఈ ఫోటోను చూసిన గంగూలీ.. భజ్జీ, గీత దంపతులకు బాబే పుట్టాడనుకున్నాు. అయితే తర్వాత తన తప్పును తెలుసుకుని సారీ చెప్పాడు. "క్షమించాలి... పాప చాలా అందంగా ఉంది... నాకు వయసు పెరుగుతోంది భజ్జీ" అంటూ మరో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు భజ్జీ స్పందిస్తూ దాదా ట్వీట్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని భజ్జీ ట్వీట్ చేశాడు.