మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (16:05 IST)

సౌతాఫ్రికా విజృంభిస్తున్న స్ట్రెయిన్ : ఆసీస్ పర్యటన రద్దు

దక్షిణాఫ్రికాలో కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తోంది. దీంతో పాటు.. కరోనా సెకండ్ వేవ్ కూడా తీవ్రంగా ఉంది. దీంతో సౌతాఫ్రికా గడ్డపై జరగాల్సిన క్రికెట్ సిరీస్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా రద్దు చేసుకుమంది. ఈ మేర‌కు క్రికెట్ సౌతాఫ్రికాకు రాసిన లేఖ‌ రాసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఆ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్  చేసింది. 
 
ఇప్పుడున్న ప‌రిస్థితుల‌లో సౌతాఫ్రికాకు వెళ్ల‌డం ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్‌, స‌పోర్ట్ స్టాఫ్‌, ఆసీస్ క‌మ్యూనిటీకి ఏమాత్రం మంచిది కాద‌ని ఆ లేఖ‌లో క్రికెట్ ఆస్ట్రేలియా స్ప‌ష్టం చేసింది. ఈ టూర్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా ఎన్నో ఏర్పాట్లు చేసింద‌ని, తాము కూడా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ టూర్ కొన‌సాగించాల‌నే భావించినా ఇప్పుడు వాయిదా వేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొన్న‌ద‌ని తెలిపింది. 
 
ఇది అంత తేలిగ్గా తీసుకున్న నిర్ణ‌యం కాద‌ని, ముఖ్యంగా ఇప్పుడు అంత‌ర్జాతీయ క్రికెట్ కొన‌సాగుతున్న స‌మ‌యంలో టూర్ ర‌ద్దు చేసుకోవ‌డం త‌మ‌కు చాలా బాధ క‌లిగిస్తోంద‌ని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. సౌతాఫ్రికాలో మ‌ళ్లీ ఎప్పుడు ప‌ర్య‌టిస్తామో త‌ర్వాత వెల్ల‌డిస్తామ‌ని చెప్పింది. ఈ నెల 14 నుంచి సౌతాఫ్రికాలో ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న ప్రారంభం కావాల్సి ఉంది. 
 
కాగా, ఇటీవల ఆస్ట్రేలియా తన సొంత గడ్డపై పర్యాటక భారత క్రికెట్ జట్టుతో వన్డే, ట్వంటీ, నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడిన విషయం తెల్సందే. ఈ పర్యటనలో భారత్ కుర్రోళ్లు అద్భుత ప్రదర్శన కారణంగా టెస్ట్ సిరీస్‌లో చారిత్మాక విజయాన్ని నమోదు చేసుకుంది.