గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2017 (12:55 IST)

191 బంతుల్లోనే 300 రన్స్.. ఎవరు... ఎక్కడ? (వీడియో)

దక్షిణాఫ్రికా క్రికెటర్ ఒకరు చరిత్రను తిరగరాశాడు. కేవలం 191 బంతుల్లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాదాడు. ఫలితంగా 96 యేళ్లనాటి రికార్డు బద్దలైపోయింది. ఆ క్రికెటర్ పేరు మార్కో మరాయిస్. సౌతాఫ్రికా ఫస్ట్ క్లాస్

దక్షిణాఫ్రికా క్రికెటర్ ఒకరు చరిత్రను తిరగరాశాడు. కేవలం 191 బంతుల్లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాదాడు. ఫలితంగా 96 యేళ్లనాటి రికార్డు బద్దలైపోయింది. ఆ క్రికెటర్ పేరు మార్కో మరాయిస్. సౌతాఫ్రికా ఫస్ట్ క్లాస్ క్రికెటర్. 
 
సౌతాఫ్రికా సెకండ్ టైర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లో భాగంగా బోర్డర్ టీమ్‌ తరపున ఆడిన మరాయిస్.. ఈస్టర్న్ ప్రావిన్స్ టీమ్‌పై ఈ ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. తమ జట్టు 82 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన మరాయిస్.. సంచలనానికి తెరలేపాడు. మరో బ్యాట్స్‌మన్ బ్రాడ్లీ విలియమ్స్ (113)తో కలిసి 428 పరుగులు జోడించాడు. మరాయిస్ తన 191 బంతుల ఇన్నింగ్స్‌లో 35 ఫోర్లు, 13 సిక్స్‌ర్లను బాదాడు. 
 
గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన చార్లీ మకార్ట్‌నీ పేరుపై ఉండేది. 1921లో ఇంగ్లండ్ టూర్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌షైర్‌పై 221 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. అదే ఇప్పటివరకు రికార్డు. ఈ రికార్డును మరాయిస్ తిరగరాసి సరికొత్త చరిత్రను లిఖించాడు. ఫలితంగా వరల్డ్ క్రికెట్‌లో సంచలనమయ్యాడు.