బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2017 (16:14 IST)

కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేయండి : కేరళ హైకోర్టు

కేరళ స్పీడ్‌స్టర్, భారత ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. శ్రీశాంత్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలంటూ భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఎత్తివేయాలంటూ ఆదేశించింది.

కేరళ స్పీడ్‌స్టర్, భారత ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. శ్రీశాంత్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలంటూ భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఎత్తివేయాలంటూ ఆదేశించింది. 
 
2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో బీసీసీఐ శ్రీశాంత్‌పై నిషేధం విధించిన సంగతి తెలసిందే. బీసీసీఐ విధించిన నిషేధాన్ని సమీక్షించాలంటూ శ్రీశాంత్ మార్చిలో కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. 2015లో ఢిల్లీ కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించినప్పటికీ... బీసీసీఐ తన నిర్ణయం మార్చుకోలేదని ధర్మాసనానికి తెలిపారు. 
 
అలాగే, తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలంటూ శ్రీశాంత్ సీవోయేకు కూడా లేఖరాశాడు. అయితే బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి శ్రీశాంత్ చేసిన విజ్ఞప్తిని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ‘‘అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించకూడదన్న’’ తమ వైఖరిని మార్చుకోబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాను నిర్దోషినైనప్పటికీ బీసీసీఐ తన ప్రాధమిక హక్కులను ఉల్లఘిస్తోందంటూ శ్రీశాంత్ కేరళ హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ ఆయనకు భారీ ఊరట లభించింది.