చండీమల్‌పై ఐసీసీ వేటు.. బాల్ ట్యాంపరింగ్ నిజమే..
వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న శ్రీలంక కెప్టెన్ చండీమల్ ఆ ఆరోపణలను ఖండించాడు. బోర్డు కూడా అతడికి అండగా నిలిచింది. తాను ట్యాంపరింగ్‌కు పాల్ప
వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న శ్రీలంక కెప్టెన్ చండీమల్ ఆ ఆరోపణలను ఖండించాడు. బోర్డు కూడా అతడికి అండగా నిలిచింది. తాను ట్యాంపరింగ్‌కు పాల్పడలేదని చెప్పాడు. అయితే, అదంతా అబద్ధమేనంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ఆధారంగా చండీమల్‌పై ఐసీసీ వేటేసింది.
విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు తేలడంతో మూడో టెస్టులో ఆడకుండా నిషేధం విధించింది. దీంతోపాటు మ్యాచ్ ఫీజులో వందశాతం జరిమానా విధించింది. తాను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడలేదని తొలుత బుకాయించిన చండీమల్ తర్వాత నిజాన్ని అంగీకరించాడు. బాల్‌ను షైన్ చేసేందుకు కృత్రిమ పదార్థాన్ని ఉపయోగించినట్టు ఐసీసీ విచారణలో తేలింది.
వీడియో ఫుటేజీ పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ పేర్కొన్నాడు. బంతిపై కృత్రిమ పదార్థాన్ని రాసినట్టు రివ్యూలో స్పష్టంగా కనిపించిందన్నాడు. దానికి లాలాజలం రాసి బంతిని మెరిపించే ప్రయత్నం చేసినట్టు గుర్తించామన్నారు.