శుక్రవారం, 25 ఏప్రియల్ 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (09:37 IST)

Sunil Gavaskar :రోబో డాగ్‌తో డ్యాన్స్ చేసిన సునీల్ గవాస్కర్ (video)

Sunil Gavaskar
Sunil Gavaskar
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఐపీఎల్‌లో అందరినీ ఆకట్టుకుంటున్న ఒక రోబోటిక్ డాగ్‌తో సరదాగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్‌లో భాగంగా మొదటిసారిగా రోబోటిక్ డాగ్‌లను ప్రవేశపెట్టారు. ఈ యంత్రాలతో నడిచే కుక్కలు టాస్ సమయంలో మ్యాచ్ బంతిని మోసుకెళ్లడం ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ రోజున, మ్యాచ్ ప్రారంభానికి ముందు సునీల్ గవాస్కర్ మైదానంలో ఉన్న రోబోటిక్ డాగ్‌తో డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.