సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 12 నవంబరు 2023 (12:40 IST)

భారత క్రికెట్ జట్టు దీపావళి వేడుకలు... అనుష్కతో కలిసి పాల్గొన్న కోహ్లీ

team india
దేశ ప్రజలు దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ వేడుకలను కూడా భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు కూడా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భారత క్రికెటర్లందరూ పాల్గొన్నారు. ఇందులో తన భార్యతో కలిసి విరాట్ కోహ్లీ పాల్గొని సందడి చేశారు. అలాగే, కెప్టెన్ రోహిత్ శర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నాడు. క్రికెటర్లందరూ సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు.
rohit couple
 
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్ కోసం భారత క్రికెట్ జట్టు బెంగుళూరులో ఓ నక్షత్ర హోటల్‌లో బసచేసివుంది. ఆ హోటల్‌లోనే భారత క్రికెటర్లు దీపావళి సంబరాలు జరుపుకున్నారు. కెప్టెన్ రోహిత్ తన భార్య, కూతురుతో కలిసి పాల్గొన్నారు. ఇక విరాట్ కోహ్లీతో పాటు ఆయన భార్య అనుష్క ఈ వేడుకల్లో సందడి చేశారు. ఆటగాళ్లంతా సంప్రదాయబద్ధంగా కుర్తీ, పైజామాలతో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.
kohli couple
 
లీగ్ దశలో చివరి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో భారత జట్టు తలపడనుంది. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ పోరుకు వేదికకానుంది. దీంతో భారత జట్టు సభ్యులు ఇప్పటికే బెంగుళూరుకు చేరుకున్నారు. శనివారం దీపావళి వేడుకలను హోటల్‌లోనే ఘనంగా జరుపుకున్నారు. జట్టులోని ఆటగాళ్లతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్, ఇతర జట్టు సభ్యులు, జట్టు మేనేజ్‌మెంట్ సభ్యులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
shami - bumra - siraj