గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2023 (09:31 IST)

ఉప్పల్ స్టేడియాన్ని ఊపేసిన 'నాటు నాటు' పాట ... కళ్లు చెదిరే లైటింగ్ డిస్‌ప్లే

uppal stadium
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియాన్ని రాజమౌళి దర్శకత్వం వహించిన "ఆర్ఆర్ఆర్" చిత్రంలోని 'నాటు నాటు' పాట ఊపేసింది. ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా మంగళవారం పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ విరామ సమయాల్లో వివిధ పాటలను ప్లే చేస్తూ, వాటికి అనుగుణంగా లైటింగ్ డిస్‌ప్లే చేశారు. ఇందులోభాగంగా, నాటు నాటు పాటను ప్లే చేసి అదిరిపోయే లైటింగ్ డిస్‌ప్లే చేశారు. దీంతో స్టేడియం ఒక్కసారిగా ఊగిపోయింది. 
 
మ్యాచ్ మధ్యలో 'నాటు నాటు' పాటను ప్లే చేయడంతో స్టేడియం మార్మోగిపోయింది. ఈ పాటను అటు క్రికెటర్లతో పాటు.. స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు, కామెంటేటర్లు ఎంజాయ్ చేశారు. కాగా, ఈ మ్యాచ్‌కు దాదాపు 20 వేల మంది వరకు ప్రేక్షకులు హాజరుకాగా, వారు కూడా నాటు నాటు పాట లైటింగ్‌ డిస్‌ప్లేతో కలిసి కాలు కదిపారు. దాంతో స్టేడియం మొత్తం ఉత్సాహభరితంగా నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తుంది. \\\