మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2023 (22:41 IST)

తడాఖా చూపెట్టిన లంకేయులు.. అదరగొట్టిన దాయాదులు.. గెలుపు ఎవరిది?

Pakistan vs Sri Lanka
Pakistan vs Sri Lanka
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా పాకిస్థాన్, శ్రీలంక జట్లు వరల్డ్ కప్ మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక భారీ స్కోరు సాధించింది. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 344 పరుగులు సాధించింది. 
 
లంకేయుల్లో కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ సమరవిక్రమ సూపర్ సెంచరీలతో అదరగొట్టారు. పాక్ ఆటగాళ్లు తేలిపోవడంతో శ్రీలంక భారీ స్కోర్ సాధించింది. వీరిలో కుశాల్ మెండిస్ 77 బంతుల్లోనే 122 పరుగులు సాధించడం విశేషం. 
 
మెండిస్ స్కోరులో 14 ఫోర్లు, 6 సిక్సులు వున్నాయి. కాగా, మెండిస్ శ్రీలంక తరఫున వరల్డ్ కప్‌లో వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. మరోవైపు సమరవిక్రమ 89 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 108 పరుగులు చేశాడు. 
 
వీరిద్దరి విజృంభణతో షహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షాదాబ్ ఖాన్ లతో  కూడిన పాక్ బౌలింగ్ విభాగం డీలా పడిపోయింది. ఆపై 345 పరుగుల లక్ష్యఛేదనలో పాకిస్థాన్‌కు కష్టాలు తప్పలేదు. కానీ పాక్ బ్యాట్స్‌మెన్లు రాణించడంతో ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక విజయవంతమైన లక్ష్యాన్ని ఇంకా 10 బంతులు మిగిలి ఉండగానే ముగించారు. 
 
రిజ్వాన్ సముచితంగా విజయవంతమైన పరుగులు సాధించాడు. అతను 121 బంతుల్లో 131 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు, ఇఫ్తికార్ 10 బంతుల్లో 22 పరుగులతో అజేయంగా నిలిచాడు. శ్రీలంక తరఫున రెండు సెంచరీలు 344/9కి చేరుకున్నాయి. అదేవిధంగా పాకిస్థాన్‌కు రెండు సెంచరీలు 345/4కి చేరుకున్నాయి. 
 
దీంతో 345 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అది జట్టుకు భారీ ఆత్మవిశ్వాసాన్ని అందించింది.