సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (11:34 IST)

క్రికెట్ వీరాభిమాని... ఫ్రాంక్‌స్టర్ జార్వోపై ఐసీసీ నిషేధం.. ఎందుకో తెలుసా?

Jorvo
క్రికెట్ వీరాభిమాని, ఫ్రాంక్‌స్టర్ జార్వోపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిషేధం విధించంది. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం చెన్నై వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలక పోరు జరిగింది. ఈ మ్యాచ్‌కు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించడంతో జార్వోపై నిషేధం విధించారు. మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో దూసుకొచ్చేందుకు జార్వో ప్రయత్నించాడు. దీన్ని గమనించిన మైదానం సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. ఈ చర్యలను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ... జార్వోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇకపై జరిగే ఈ వన్డే ప్రపంచ కప్ పోటీలకు రాకుడదంటూ ఐసీసీ నిషేధం విధించింది. 
 
ఆదివారం మ్యాచ్ జరుగుతుండగా పిచ్‌పైకి దూసుకొచ్చేందుకు జార్వో ప్రయత్నించగా, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ప్రపంచ కప్‌కు సంబంధించి వ్యక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ఐసీసీ పేర్కొంది. ఇలాంటి పునరావృతం కాకుండా స్థానిక అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. 
 
కాగా, డేనియర్ జార్వో... క్రికెట్ ప్రపంచానికి సుపరిచితమైన పేరు. క్రికెట్ ప్రేమికుడు. మంచి ఫ్రాంక్‌స్టర్ కూడా. అయితే, మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారిగా మైదానంలో దూసుకొచ్చి నానా యాగీ చేయడం అలవాటు. ఇప్పటికే ఎన్నోసార్లు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. అయినా తన తీరును మార్చుకోలేదు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌లోనూ ఇదే విధంగా ప్రవర్తించి నిషేధానికి గురయ్యాడు.