గురువారం, 6 మార్చి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 9 మే 2016 (15:53 IST)

సచిన్ కంటే, కాంబ్లీనే బెస్ట్.. వారిద్దరి మధ్య పోలికలేంటంటే?: కపిల్ దేవ్

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను అతని స్నేహితుడైన వినోద్ కాంబ్లీలను 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ పోల్చాడు. సచిన్ కంటే వినోద్ కాంబ్లీనే ప్రతిభగల ఆటగాడని కపిల్ దేవ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే కాంబ్లీకి సరైన మద్దతు లేకపోవడం వల్లనే క్రికెట్‌లో రాణించలేకపోయాడన్నాడు. సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల పాటు దేశానికి ప్రాతినిథ్యం వహిస్తే, చిన్న వయసులోనే అద్భుతాలను చేసిన కాంబ్లీ ఆ తర్వాత కాలంలో కనుమరుగయ్యాడని గుర్తు చేశాడు.
 
ప్రతిభ గల క్రీడాకారులు స్టార్లుగా ఎదగాలంటే వారి కుటుంబ సహకారం ఎంతో కీలకమని కపిల్ దేవ్ అన్నాడు. 'సచిన్‌, కాంబ్లీ ఇద్దరూ సమాన ప్రతిభగల ఆటగాళ్లు. వాస్తవానికి కాంబ్లీలోనే టాలెంట్‌ ఎక్కువని కితాబిచ్చాడు. వినోద్ పెరిగిన విధానానికి, వారి కుటుంబ సభ్యుల మద్దతుకు.. సచిన్‌‍కు పూర్తిగా భిన్నమని కపిల్ వెల్లడించాడు. దాని ప్రభావమే వారిద్దరి క్రీడా జీవితంపై పడిందని చెప్పుకొచ్చాడు.