విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. ధోనీ ఫీట్‌ను అధిగమించాడుగా..!

kohli
ఎం| Last Updated: బుధవారం, 29 జనవరి 2020 (16:38 IST)
పరుగుల వీరుడు, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. కెప్టెన్‌గా టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా కోహ్లీ రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డు ఎంఎస్ ధోని పేరు మీద ఉంది.

ధోని 72 మ్యాచ్‌లలో 1112 పరుగులు చేయగా.. కోహ్లీ 36 మ్యాచ్‌లలో 1126 పరుగులు చేసి ఈ ఫీట్‌ను అధిగమించాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మూడో టీ20 ఆడుతుంది.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ 27 బంతులలో 38 పరుగులు చేసి ధోని రికార్డును బద్దలు కోట్టాడు. ఈ లిస్టులో సౌతాఫ్రికా ఆటగాడు డూప్లిసెస్ 40 మ్యాచ్‌లలో 1273 పరుగులు చేసి మొదటిస్థానంలో ఉన్నాడు.

ఆ తర్వాత న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ 41 మ్యాచ్‌లలో 1148 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి తర్వాతా కోహ్లీ మూడోవాడిగా తన పేరును నమోదు చేసుకున్నాడు.దీనిపై మరింత చదవండి :