శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 26 మార్చి 2016 (16:58 IST)

బంగ్లాదేశ్‌పై ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదు : విరాట్ కోహ్లీ

బెంగుళూరులో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టుపై ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదనీ, గెలిచామా లేదా అన్నదే ముఖ్యమని భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ మ్యాచ్‌ గెలుపుపై అనేక విమర్శలు వస్తున్నాయి. క్రికెట్ పసికూన బంగ్లాదేశ్‌పై ఆపసోపాలు పడి భారత్ గెలుపొందిందని అనేక మంది విమర్శలు గుప్పిస్తున్నారు.
 
దీనిపై విరాట్ కోహ్లీ స్పందించాడు. బంగ్లాదేశ్‌పై ఎలా గెలిచామనేది కాదు గెలిచామా? లేదా? అనేది ముఖ్యమన్నాడు. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టు క్రికెట్‌ను ప్యాషన్‌తో ఆడతారని, అలాంటి జట్టుపై ఆడటం ఓ సవాలేనని, అలాంటి ఛాలెంజ్ తనకు ఇష్టమని కోహ్లీ చెప్పాడు. క్రికెట్ ఆడటంలో నెర్వస్‌నెస్, ఒత్తిడి పనికిరాదన్నారు. టి20 అనే ఫార్మట్‌కు ఏకాగ్రత అతి ముఖ్యమన్నాడు. అందువల్ల తమ దృష్టంతా ప్రస్తుతం దీనిపైనే ఉందన్నారు. ధోనీ ప్రశాంతంగా ఉంటాడని, అదే ఆయనలో గొప్ప లక్షణమని కోహ్లీ కితాబునిచ్చాడు.