అనుష్కతో నిశ్చితార్థమా.. అవన్నీ ఉత్తుత్తివే.. న్యూస్ ఛానెళ్లు ఇక ఆపండి..

ప్రేమ పక్షులైన టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తమ లవ్ స్టోరీకి పుల్ స్టాప్ పెట్టి ఓ ఇంటివారు కానున్నారు. ఈ న్యూయర్ ఇయర్ రోజున ఈ ఇద్దరూ ఎంగేజ్‌మెంట్‌కి సిద్ధ‌మ‌వుతున్న

Selvi| Last Updated: శుక్రవారం, 30 డిశెంబరు 2016 (11:56 IST)
ప్రేమ పక్షులైన టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ తమ లవ్ స్టోరీకి పుల్ స్టాప్ పెట్టి ఓ ఇంటివారు కానున్నారు. ఈ న్యూయర్ ఇయర్ రోజున ఈ ఇద్దరూ ఎంగేజ్‌మెంట్‌కి సిద్ధ‌మ‌వుతున్నట్లు స‌మాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అనుష్క శర్మతో త్వరలో తన నిశ్చితార్థం జరగబోతోందన్న వదంతులకు తెరదించాడు విరాట్ కోహ్లీ.

ఇంగ్లాండ్‌తో సిరీస్‌ మధ్య విరామం దొరకడంతో విరాట్‌కోహ్లీ.. ప్రియురాలు, బాలీవుడ్‌ తార అనుష్క శర్మతో కలిసి డెహ్రాడూన్‌లో ఉల్లాసంగా గడుపుతున్నాడు. అయితే వీళిద్దరూ జనవరి 1న నిశ్చితార్థం చేసుబోతున్నట్లు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగుతోంది. దీంతో ట్విట్టర్లో ఈ విషయంపై స్పందించిన విరాట్‌ తమ నిశ్చితార్థం వార్తలను ఖండించాడు. తాము నిశ్చితార్థం చేసుకోబోవటం లేదని ఒకవేళ చేసుకుంటే దాన్ని దాచిపెట్టబోమని క్లారిటీ ఇచ్చాడు. న్యూస్ ఛానెళ్లు ఇక ఇలాంటి తప్పుడు వార్తలను ప్రసారం చేయడాన్ని ఆపాల్సిందిగా కోరాడు.



దీనిపై మరింత చదవండి :