ముంబై టెస్ట్ : ఇంగ్లండ్‌ను చుట్టేసిన స్పిన్నర్లు.. భారత్ ఘన విజయం
ముంబైలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టును భారత స్పిన్నర్లు బంతాట ఆడుకున్నారు. దీంతో భారత్ ఘన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 36 పరుగుల తేడ
ముంబైలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టును భారత స్పిన్నర్లు బంతాట ఆడుకున్నారు. దీంతో భారత్ ఘన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0తో సిరీస్ సాధించింది.
వాంఖడేలో టాస్ గెలిస్తే సగం మ్యాచ్ గెలిచినట్లే! టాస్ ఇంగ్లాండ్ సొంతమే అయింది. పైగా తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 400 పరుగులు చేసింది. అందులోనూ ఆ జట్టు వాంఖడెలో ఆడిన గత రెండు టెస్టుల్లోనూ వారిదే విజయం. ఈ నేపథ్యంలో భారత్ బ్యాటింగ్‌కు దిగుతున్నపుడు.. మ్యాచ్‌ను డ్రాగా ముగించి సిరీస్‌ను చేజిక్కించుకోవడం మీదే దృష్టిపెట్టాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వినిపించాయి. కానీ ఇప్పుడు కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌పై ప్రతీకార సిరీస్ విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ‘విరాట్ విజయంత్’ అద్భుత బ్యాటింగ్‌తో 631 పరుగులకు ఆలౌటై ఇంగ్లండ్ కంటే 231 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. భారీ పరుగుల లోటును చేధించేందుకు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు.
ఫలితంగా ఇంగ్లండ్‌ను 195 పరుగులకే ఆలౌట్ చేసి మ్యాచ్‌తో పాటు సిరీస్ గెలిచి ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకున్నారు. వీర విహారం చేసిన విరాట్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఇదిలావుండగా, భారత్ - ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టులో భారత ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ 10 వికెట్లు తీశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీశాడు. అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో 10 వికెట్ల ప్రదర్శన చేయడం ఇది ఏడోసారి. 43 టెస్టుల్లో అశ్విన్ ఏడు సార్లు పది వికెట్లు తీయగా, అనిల్ కుంబ్లే 132 టెస్టుల్లో ఎనిమిది సార్లు ఈ ఘనత సాధించాడు.