క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌ జట్టులో కోహ్లీకి స్థానం

Last Updated: మంగళవారం, 1 జనవరి 2019 (11:13 IST)
టీమిండియా క్రికెటర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌గా కోహ్లీ నిలిచాడు. ఇదే జాబితాలో కోహ్లీతో పాటు భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, కుల్‌దీప్ యాదవ్‌లకు స్థానం లభించింది. 
 
30 ఏళ్ల విరాట్ కోహ్లీ వన్డే, ట్వంటీ-20‌ సంప్రదాయ టెస్టు క్రికెట్‌లో తనదైన శైలిలోఆకట్టుకుంటున్నాడు. వన్డేల్లో 1,200 పరుగులు సాధించాడు. అలాగే 2018లో 1,030 పరుగులు సాధించాడు. అలాగే కుల్‌దీప్ 45 వికెట్లు పడగొట్టాడు. 
 
ఇంకా క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే టీమ్ ఆఫ్ 2018లో జో రూట్, షిమ్రోన్, పెరెరా, రషీద్ ఖాన్, ముస్తాఫిజుర్, జస్‌ప్రీత్ బూమ్రాలకు చోటుదక్కింది. ఇక బూమ్రా 22 వికెట్లు పడగొట్టింది.దీనిపై మరింత చదవండి :