సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 నవంబరు 2023 (10:13 IST)

కెప్టెన్‌గా మారిన విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మకు షాక్

rohit kohli
వన్డే ప్రపంచకప్ లీగ్ దశ ముగియగానే.. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రపంచకప్ అత్యుత్తమ జట్టును ప్రకటించింది. మొత్తం 12 మంది ప్లేయర్లలో ఈ వరల్డ్ కప్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్‌ను ఎంపిక చేసింది. 
 
భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా ఎంపిక చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. రోహిత్ శర్మకు షాక్ ఇచ్చింది. ఈ ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మకు అత్యుత్తమ జట్టులో చోటు ఇవ్వలేదు. 
 
భారత్ నుంచి కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ, జస్ ప్రీత్ బుమ్రాలకు చోటు ఇచ్చింది. ఇక ఆస్ట్రేలియా నుంచి డేవిడ్ వార్నర్, మ్యాక్స్‌వెల్, ఆడం జంపాలు చోటు దక్కించుకున్నారు. 
 
సౌతాఫ్రికా నుంచి క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, మార్కో యాన్సెన్‌లకు చోటు ఇచ్చింది. న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్రను తీసుకుంది.