గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 నవంబరు 2023 (18:23 IST)

బిగ్ బాస్ డోర్స్ తీయండి. నేను వెళ్లిపోతా..? BBహౌస్ కొత్త కెప్టెన్ శివాజీ?

Shivaji
Shivaji
బిగ్ బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్‌తో హౌస్‌లో మళ్లీ హీట్ పెంచాడు బిగ్ బాస్. టాస్క్‌లో భాగంగా ఓ బేబీ బొమ్మను తీసుకొని సౌండ్‌ మోగిన ప్రతిసారి ఇంటి సభ్యులందరూ మిగతా పోటీదారుల బేబీ నుంచి ఒకదానిని తీసుకుని అవతలివైపు ఉన్న బేబీ కేర్‌ జోన్‌లోకి వెళ్లాలి. 
 
ఈ గేమ్‌లో గౌతమ్‌, శివాజీల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఊరికే గొడవ పెట్టుకుంటాడు అని గౌతమ్‌ను ఉద్దేశించి శివాజీ అనడంతో తనకు అన్యాయం జరిగింది. అలాంటి సమయంలో తాను రెస్పాండ్ అవుతాను అని గట్టిగా అరుస్తాడు. దీంతో నువ్వే కాదు అరిచేది అని శివాజి కూడా గట్టిగా అరిచాడు.  
 
కేవలం అటెన్షన్ కోసమే గౌతమ్ ఇలా బిహేవ్ చేస్తాడు అనగా.. కోపంతో మైక్‌ను కిందపడేసిన డోర్‌ తీయండి వెళ్లిపోతా అంటూ గౌతమ్ తలుపులను బాదాడు. అనంతరం యావర్ అమర్ మధ్య కూడా గొడవ జరిగింది.
 
బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్కులో చివరి రౌండ్‌లో గౌతమ్, శివాజి, అర్జున్‌లు ఉన్నారు. వీరిలో శివాజి బొమ్మను అర్జున్, అర్జున్ బొమ్మను గౌతమ్, గౌతమ్ బొమ్మను శివాజి తీసుకున్నారు. దీంతో నిన్నటి ఎపిసోడ్ ఫైర్‌తో సాగింది. ఇక, ఈ వారం ఆయనే కెప్టెన్ అయినట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది.