సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 జులై 2020 (17:50 IST)

కరోనా కాలం.. భార్య కోసం విరాట్ కోహ్లీ ఏం చేశాడంటే?

కరోనా నేపథ్యంలో లాక్​డౌన్​ తరుణంలో తన భార్య పుట్టిన రోజు సందర్భంగా భార్య అనుష్క శర్మ కోసం స్వయంగా తొలిసారిగా కేక్​ తయారుచేసినట్లు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తెలిపాడు. తాజాగా మయాంక్​ అగర్వాల్​తో సరదాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కోహ్లీ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అలా భార్యకు తయారు చేసిపెట్టిన కేక్ తనకు బాగా నచ్చిందని తెలిపాడు. అది తనకెంతో ప్రత్యేకమైందని అనుష్క అతడితో చెప్పినట్లు గుర్తుచేసుకున్నాడు.
 
ఆ సందర్భం లాక్​డౌన్​ జ్ఞాపకంగా, తన జీవితంలో ప్రత్యేకమైనదిగా ఎప్పటికీ గుర్తుండిపోతుందని కోహ్లీ తెలిపాడు. దీంతో పాటు ఫిట్​నెస్​పై పూర్తి దృష్టి సారించినట్లు తెలిపాడు కోహ్లీ. అయితే స్ల్పిట్​, బల్గేరియన్​ స్క్వాడ్ వంటి ఎక్స్​ర్​సైజ్​లు చేయడానికి ఎక్కువ ఇష్టపడడని చెప్పాడు. పవర్​ స్నాచ్​ కసరత్తు చేయడం బాగుంటుందని చెప్పుకొచ్చాడు. బెండకాయతో చేసిన లహ్​సునీ పాలక్​ వంటకాన్ని ఇష్టపడతానని వెల్లడించాడు.
 
కాగా లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన కోహ్లి రెగ్యులర్‌ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంతో పాటు, పుస్తకాలు చదవడం, కుటుంబంతో వీలైనంత సమయాన్ని గడపడం ద్వారా కరోనా కాలంలో తనను తాను బిజీగా ఉంచుకుంటున్నాడు.