కరోనా రోగులకు అరకొర భోజనం.. ఇంకా దుర్వాసనతో కూడిన ఫుడ్
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. అలాగే కరోనా రోగులు వార్డుల్లో కనీస వసతులు లేకుండా నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో కరోనా రోగులు పడుతున్న కష్టాలన్నీ ఇన్నీ కావు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం లోని కోవిడ్ సెంటర్‌లో దుర్వాసన వచ్చే భోజనం పెడుతున్నారని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోవిడ్ పేషంట్లు కరోనా బారినుంచి త్వరగా కోలుకోవడానికి పౌష్టిక ఆహరంతో కూడిన ఆహరం తీసుకోవడం చాలా అవసరం. కానీ కరోనా రోగులకు ఇచ్చే ఆహారంలో పురుగులు వుండటం అలాగే.. దుర్వాసన రావడం వంటి వార్తలు చర్చనీయాంశమైనాయి.
కానీ తాడేపల్లిగూడెం కోవిడ్ సెంటర్లో పరిస్థితి వేరుగా ఉంది. పాడైపోయిన భోజనం పెడుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేషంట్లకు ఇచ్చే భోజనం నుంచి దుర్వాసన రావడంతో డస్ట్ బిన్ లో పడేసి తమ బాధను వ్యక్తం చేశారు.
తాము వచ్చిన నాటి నుంచి అరకొర భోజనమే పెడుతున్నారని వాపోతున్నారు. ఆదివారం పెట్టిన ఆహారంలో భరించలేని దుర్వాసన రావడంతో భోజనం పడేశామని రోగులు ఆవేదన చెందుతున్నారు.