మంగళవారం, 15 జులై 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 16 మే 2016 (12:09 IST)

ఐపీఎల్-9లో ఫేవరేట్‌గా హైదరాబాద్: పంజాబ్‌పై విన్.. ప్లే ఆఫ్‌కు అర్హత..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్లో హైదరాబాద్ సత్తా చాటింది. మొహాలీ వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు గెలుపును నమోదు చేసుకుంది. తద్వారా ఐపీఎల్ పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకోవడంతో పాటు నాకౌట్ దశకు చేరిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. 
 
బ్యాట్స్‌మెన్లు సత్తా చాటడంతో హైదరాబాద్ సునాయాసంగా గెలుపును నమోదు చేసుకున్నట్లైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులు సాధించింది. పంజాబ్ ఆటగాళ్లలో ఆమ్లా (96) సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచాడు. గురుకీరత్ (27), మిల్లర్ (20)లు రాణించారు.  
 
అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టులో ఓపెనర్ వార్నర్‌ (52) రాణించగా, శిఖర్‌ ధావన్‌ (25), దీపక్‌ హుడా (34), బెన్‌ కట్టింగ్‌ (21) యువరాజ్‌ సింగ్‌ (42, 24 బంతుల్లో  3 ఫోర్లు, 3 సిక్సర్లు) చివర్లో మెరుగ్గా రాణించడంతో మరో రెండు బంతులు మిగిలి వుండగానే మూడు వికెట్ల నష్టానికి హైదరాబాద్ 183 పరుగులు సాధించింది. ఈ విజయంతో ప్లే ఆఫ్ కి చేరుకోవడంతో పాటు.. ఐపీఎల్ 9వ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫేవరేట్ టీమ్‌గా నిలిచింది.