శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 8 జనవరి 2017 (14:06 IST)

ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చేయనందుకు ధన్యవాదాలు : రోహిత్ శర్మ సెటైర్

స్వదేశంలో ఇంగ్లండ్‌తో ప్రారంభంకానున్న వన్డే సిరీస్‌కు తనను ఎంపిక చేయనందుకు భారత క్రికెటర్ రోహిత్ శర్మ ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల కొంతకాలంగా తొడకండరాల గాయంతో రోహిత్ శర్మ జట్టుకు దూరంగా ఉన్న విషయం తెల్స

స్వదేశంలో ఇంగ్లండ్‌తో ప్రారంభంకానున్న వన్డే సిరీస్‌కు తనను ఎంపిక చేయనందుకు భారత క్రికెటర్ రోహిత్ శర్మ ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల కొంతకాలంగా తొడకండరాల గాయంతో రోహిత్ శర్మ జట్టుకు దూరంగా ఉన్న విషయం తెల్సిందే. ఇంకా మ్యాచ్‌లు ఆడేందుకు ఫిట్‌గా లేడన్న కారణంతో, త్వరలో జరిగే ఇంగ్లండ్ సిరీస్‌కు రోహిత్‌ పేరును పరిశీలించలేదు. 
 
దీనిపై రోహిత్ స్పందించాడు. తనను ఎంపిక చేయని వారికి ధన్యవాదాలంటూ సెటైర్ వేశాడు. తన టార్గెట్ ఆస్ట్రేలియాతో సిరీస్ అని, అప్పటికి ఫిట్నెస్ తెచ్చుకుంటానని చెప్పాడు. కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి వన్డే పోటీలో రోహిత్ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే. ఆపై ఇంగ్లండ్‌తో సిరీస్‌కూ దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ ఫిబ్రవరిలో మొదలు కానున్న నేపథ్యంలో ఆ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించాలన్న లక్ష్యంతో రోహిత్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.