ధోనీ నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తాను.. పూర్తి స్థాయి కెప్టెన్‌గా హ్యాపీ: కోహ్లీ
ఆదివారం ఇంగ్లండ్‌తో తొలి వన్డే నేపథ్యంలో, మొదటిసారి వన్డేలకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగుతుండడం పట్ల కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. ఇంగ్లండతో జరగబోయే సిరీస్‌కు ఎంపికైన భారత జ
ఆదివారం ఇంగ్లండ్‌తో తొలి వన్డే నేపథ్యంలో, మొదటిసారి వన్డేలకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా బరిలోకి దిగుతుండడం పట్ల కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. ఇంగ్లండతో జరగబోయే సిరీస్‌కు ఎంపికైన భారత జట్టులో ధోనీ అత్యంత విలువైన ఆటగాడని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ధోని నుంచి ఎన్నో విలువైన సలహాలు, సూచనలను స్వీకరిస్తానని కోహ్లీ అన్నాడు. ప్రస్తుతం ఉన్న జట్టులోని ఆటగాళ్లందరూ మంచి ఫామ్‌లో ఉన్నారని చెప్పాడు.
అందరూ ఊహించిన జట్టుతోనే బరిలోకి దిగుతామని.. టెస్టు సిరీస్ ఓడినంత మాత్రాన ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయమన్నాడు. జట్టులో స్థానం దక్కించుకున్న యువరాజ్ సింగ్ మెరుగ్గా రాణించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాడని కోహ్లీ వ్యాఖ్యానించాడు. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం టెస్టు సిరీస్ ఓటమిని వన్డే సిరీస్‌లో నెగ్గేలా రాణించాలని భావిస్తోంది.