బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2017 (11:20 IST)

యువరాజ్ సింగ్ పేరును పాడు చేసే ప్రయత్నం సాగుతోంది: షబ్నమ్ సింగ్

టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరును పాడు చేసే ప్రయత్నం చేస్తోందని.. తన కోడలు ఆకాంక్షపై అతని తల్లి షబ్నమ్ సింగ్ ఫైరయ్యారు. ఢిల్లీలో యువీ మాట్లాడుతూ.. యువరాజ్‌కి, ఈ కేసుకి సంబంధం ఏంటని ప్రశ్నించారు

టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరును పాడు చేసే ప్రయత్నం చేస్తోందని.. తన కోడలు ఆకాంక్షపై అతని తల్లి షబ్నమ్ సింగ్ ఫైరయ్యారు. ఢిల్లీలో యువీ మాట్లాడుతూ.. యువరాజ్‌కి, ఈ కేసుకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఆకాంక్ష యువరాజ్ సోదరుడు జొరావర్‌ సింగ్‌ భార్య మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రతిసారీ యువీ అరెస్టయ్యాడా? అంటూ వస్తున్న ప్రశ్నలతో చిత్రవధ అనుభవిస్తున్నామని చెప్పుకొచ్చారు. 
 
ఇంతవరకు పలు ఇంటర్వ్యూల్లో యువీ తనకు సోదరుడిలా ఉండేవాడని ఆకాంక్ష చెప్పిందని గుర్తు చేశారు. అలాంటి యువరాజ్‌పై ఆమె కేసు పెట్టే ప్రయత్నం చేసిందని ఫైర్ అయ్యారు. యువీ పేరు వాడుకుని వసూలు చేయాలని చూస్తోందని ఆమె ఆరోపించారు. అందుకే తమ కుటుంబంపై ఆకాంక్ష గృహహింస కేసు నమోదు చేయించిందని ఆవేదన వ్యక్తం చేశారు.