గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 4 జూన్ 2017 (20:34 IST)

పాక్ బౌలర్లను ఊచకోత కోసిన యువీ. కోహ్లీ, పాండ్యా.. పాక్‌కు 324 పరుగుల లక్ష్యం

చివరి ఓవర్లలో పాక్ బౌలింగ్‌ను ఊచకోత కోసిన టీమిండియా ఐసీసీ ఛాపియన్‌షిప్ టోర్నీలో ఆదివారం జరుగతున్న మ్యాచ్‌లో ప్రత్యర్థికి 324 పరుగుల భారీ లక్ష్యం విధించింది. వర్షం కారణంగా 48 ఓవర్లకు కుదించిన మ్యాచ్‍‌లో దురదృష్టవశాత్తూ రోహిత్ రనౌట్ అయినప్పటికీ అప్పటిక

చివరి ఓవర్లలో పాక్ బౌలింగ్‌ను ఊచకోత కోసిన టీమిండియా ఐసీసీ ఛాపియన్‌షిప్ టోర్నీలో ఆదివారం జరుగతున్న మ్యాచ్‌లో ప్రత్యర్థికి 324 పరుగుల భారీ లక్ష్యం విధించింది. వర్షం కారణంగా 48 ఓవర్లకు కుదించిన మ్యాచ్‍‌లో దురదృష్టవశాత్తూ రోహిత్ రనౌట్ అయినప్పటికీ అప్పటికే పాక్ పని అయిపోయింది. తర్వాత బరిలోకి దిగిన యువరాజ్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 32 బంతుల్లో 52 పరుగులతో మెరుపు వేగంతో అర్ధ సెంచరీ చేసిన యువరాజ్, హసన్ ఆలీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అవతలి వైపు కోహ్లీ కూడా దూకుడు ప్రదర్శించడంతో ఈ ఇద్దరూ 38 బంతుల్లోనే 83 పరుగులు చేసి విధ్వంసం సృష్టించారు. 
 
46వ ఓవర్లో రెండో బంతికి యువరాజ్ అవుటైన తర్వాత బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా తానెంత విలువైన ఆటగాడో తేల్చి చెప్పాడు. ధోనీని మించిన దూకుడుతనంతో 47వ ఓవర్ తొలి మూడు బంతులకు 3 సిక్సర్లు సంధించిన పాండ్యా పాక్ బౌలర్‌ ఇమాద్ వసీద్‌కు చుక్కలు చూపించాడు. అవతలి ఎండ్ నుంచి కెప్టెన్ కోహ్లీ సైతం పాండ్యా విజృంభణను చూస్తూ నవ్వుకోవడం విశేషం. 
 
48 పరుగులకు 319 పరుగులు చేసిన టీమిండియా పాక్ ముందు భారీ లక్ష్యం విధించింది. చివరి ఓవర్లో 23 పరుగులు పిండుకున్న టీమిండియా చివరి 4 ఓవర్లలోనే యువీ, కోహ్లీ, పాండ్యా ధాటికి 72 పరుగులు సాధించి పాక్‌కు షాక్ తెప్పించింది. ఏరకంగా చూసినా భారత్‌ సెన్షేషనల్ ఫినిష్ సాధించింది.