బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 4 జూన్ 2017 (21:40 IST)

యువరాజ్ అందుకు అవసరం.. పాండ్యా ఇందుకు అవసరం

ఐసీసీ చాంపియన్స్ టోర్నీలో చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా మూడు వరుస సిక్స్‌లను చూసి తరించినవారికి టీమిండియాలో ఒక వర్ధమాన ఆల్ రౌండర్ ఎంత బలంగా తయారవుతున్నాడో అర్థమవుతుంది. పాక్ బౌలింగ్ బలహీనంగా లేదు కాని చివరి ఓవర్లో వరుస బంతుల్లో సిక్సులు సాధించి కెప్ట

ఐసీసీ చాంపియన్స్ టోర్నీలో చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా మూడు వరుస సిక్స్‌లను చూసి తరించినవారికి టీమిండియాలో ఒక వర్ధమాన ఆల్ రౌండర్ ఎంత బలంగా తయారవుతున్నాడో అర్థమవుతుంది. పాక్ బౌలింగ్ బలహీనంగా లేదు కాని చివరి ఓవర్లో వరుస బంతుల్లో సిక్సులు సాధించి కెప్టెన్ కోహ్లీని కూడా ఆనందపర్చిన స్థాయి బ్యాటింగ్ చేయడం పాండ్యాకు అనుకోని భాగ్యం మాత్రం కాదు  బంగ్లాదేశ్తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో కూడా తొలి ఇన్నింగ్స్‌లో సిక్స్ బాదిన పాండ్యా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ తీశాడు. ఐపీఎల్‌లో కూడా పాండ్యా ఎన్నోసార్లు చెలరేగి అడిన విషయం తెలిసిందే. 
 
అయితే చివరి ఓవర్లో బంతిని బలంగా బాదేవారు టీమిండియాలో చాలా కాలంగా కరువయ్యారు. సరిగ్గా ఆ లోటును తీర్చిన ఘనతను పాండ్యా తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇంతవరకు అతడి ఆటను గమనించినట్లయితే పాండ్యా ఇండియా బెన్ స్టోక్స్ కావడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కావలసిందల్లా సరైన రీతిలో అతడిని తీర్చిదిద్దడమే. ప్రస్తుత ఆట తీరును కొనసాగించినట్లయితే 2019 ప్రపంచ కప్ టోర్నీలో పాండ్యా అద్భుతాలు సృష్టించడం తధ్యం.
 
ఇక యువరాజ్ ఆట ప్రదర్శనీయం. వర్షం కారణంగా 48 ఓవర్లకు కుదించిన మ్యాచ్‍‌లో దురదృష్టవశాత్తూ రోహిత్ రనౌట్ అయినప్పటికీ అప్పటికే పాక్ పని అయిపోయింది. తర్వాత బరిలోకి దిగిన యువరాజ్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 32 బంతుల్లో 52 పరుగులతో మెరుపు వేగంతో అర్ధ సెంచరీ చేసిన యువరాజ్, హసన్ ఆలీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అవతలి వైపు కోహ్లీ కూడా దూకుడు ప్రదర్శించడంతో ఈ ఇద్దరూ 38 బంతుల్లోనే 83 పరుగులు చేసి విధ్వంసం సృష్టించారు. 
 
46వ ఓవర్లో రెండో బంతికి యువరాజ్ అవుటైన తర్వాత బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా తానెంత విలువైన ఆటగాడో తేల్చి చెప్పాడు. ధోనీని మించిన దూకుడుతనంతో 47వ ఓవర్ తొలి మూడు బంతులకు 3 సిక్సర్లు సంధించిన పాండ్యా పాక్ బౌలర్‌ ఇమాద్ వసీద్‌కు చుక్కలు చూపించాడు. అవతలి ఎండ్ నుంచి కెప్టెన్ కోహ్లీ సైతం పాండ్యా విజృంభణను చూస్తూ నవ్వుకోవడం విశేషం.