మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 6 జూన్ 2017 (04:38 IST)

ఆ భీకర అటాకింగ్ ముందు చిన్నబోయాను.. కోహ్లీ నిజాయితీకి జోహార్లు

అద్భుతం, అమోఘం, అనన్యం... ఆదివారం బర్మింగ్ హామ్‌లో భారత్-పాక్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల దూకుడును వర్ణించడానికి ఈ పదాలు కూడా సరిపోవేమో.. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో పాక్‌ని ఊచకోత కోసిన భారత్ దాయాదిపోరుల

అద్భుతం, అమోఘం, అనన్యం... ఆదివారం బర్మింగ్ హామ్‌లో భారత్-పాక్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల దూకుడును వర్ణించడానికి ఈ పదాలు కూడా సరిపోవేమో.. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో పాక్‌ని ఊచకోత కోసిన భారత్ దాయాదిపోరులో అద్భుతమే సృష్టించింది. టీమిండియాలో మొదట బ్యాటింగ్‌కు వచ్చిన నలుగురు బ్యాట్స్‌మన్ అర్థ సెంచరీలు చేయడం సామాన్యమైన విషయం కాదు. మరొక బ్యాట్స్‌మన్  హార్దిక్ పాండ్యా 6 బంతుల్లో చేసిన 20 పరుగులతో ఓవర్లు ముగిసిపోయాయి కాకుంటే మరో పది బంతులు ఉంటే చాలు పాండ్యా కూడా అర్థ సెంచరీ చేసేవాడు. రోహిత్ శర్మ చేసిన 91 పరుగుల కంటే 28 బంతుల్లో 50 పైగా పరుగులు చేసిన యువరాజ్ పాకిస్తాన్‌కు చుక్కలు చూపడమే కాదు ఒంటిచేత్తో భారత్‌కు విజయాన్ని ముందే లిఖించిపెట్టాడు. పరుగులు రాని దశలో బ్యాటింగ్‌కు వచ్చిన యువరాజ్‌పై కోహ్లీ మామూలుగా ప్రశంసించలేదు.
 
 
దాయాదుల పోరులో 32 బంతుల్లోనే 52 పరుగులు చేసి గేమ్‌ చేంజర్‌గా నిలబడ్డ యువీపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు. అతను చెలరేగి ఆడుతుంటే.. అతని ముందు తానొక క్లబ్‌ బ్యాట్స్‌మన్‌లా చిన్నబోయానని అంగీకరించాడు. నిజానికి వన్డేల్లో చెలరేగి ఆడటం కోహ్లి నైజం. కానీ ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కుదురుకోవడానికి కోహ్లి కొంత సమయం తీసుకున్నాడు. అయినా టీమిండియా స్కోరు బోర్డు ఎక్కడా ఆగలేదు. అందుకు కారణం యువీ దూకుడు. 36.4 ఓవర్లలో 1922గా ఉన్న జట్టు స్కోరును మరో 58 బంతుల్లోనే 2853కు యువీ-కోహ్లి జోడీ తీసుకెళ్లింది.
 
మొదట్లో కొంత తడబడ్డట్టు కనిపించిన కోహ్లి యువీ బాగా ఆడుతుండటంతో ఊపిరి తీసుకోగలిగాడు. అదే విషయాన్ని మ్యాచ్‌ అనంతరం కోహ్లి చెప్పాడు. ‘యువరాజ్‌ అద్భుతంగా ఆడాడు. నేను సరిగ్గా ఆడలేకపోయిన సమయంలో నాపై ఉన్న ఒత్తిడినంతా అతను దూరం చేశాడు. అతని ముందు నేనొక క్లబ్‌ బ్యాట్స్‌మన్నేమో అనిపించింది. అతను ముమ్మూటికి గేమ్‌చేంజర్‌. అందుకే జట్టులోకి తీసుకున్నాం’ అని కోహ్లి అన్నాడు.