క్యాచ్ పట్టడంలో కొత్త నిర్వచనం.. వృద్ధి మాన్ సాహా
పుణెలో తొలి టెస్ట్ తొలి రోజు ఆసీస్ లో ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఓ కీఫీ బ్యాట్ అంచును తాకి వేగంగా వెళ్లిపోతున్న బంతిని సాహా కుడివైపు డైవ్ చేసి గాల్లో తేలుతూ పట్టాడు. క్షేమంగే మైదానాన్ని తాకాడు. ఆ క్షణం కెప్టెన్ కోహ్లీ సహా అందరూ ఆ ఫీట్‌కి ఆశ్చర్యపోయారు. ఇది
పుణెలో తొలి టెస్ట్ తొలి రోజు ఆసీస్ లో ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఓ కీఫీ బ్యాట్ అంచును తాకి వేగంగా వెళ్లిపోతున్న బంతిని సాహా కుడివైపు డైవ్ చేసి గాల్లో తేలుతూ పట్టాడు. క్షేమంగే మైదానాన్ని తాకాడు. ఆ క్షణం కెప్టెన్ కోహ్లీ సహా అందరూ ఆ ఫీట్‌కి ఆశ్చర్యపోయారు. ఇది అతని కెరీర్‌లో మరువలేని క్యాచ్ అవుతుందంటూ అందరూ అభినందనలతో ముంచెత్తారు. పుణె బ్యాట్‌మాన్.. కాదు! సూపర్‌మాన్.. కాదు! మరెవరు.. అది వృద్ధిమాన్. టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా సూపర్బ్ క్యాచ్‌కు క్రికెట్ దిగ్గజాలు, అభిమానులు ఫిదా అయిపోయారు. ఆ బెంగాల్ ఆటగాడి పేరు గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో మార్మోగిపోయింది.
తొలి టెస్టు మ్యాచ్‌లో 82వ ఓవర్. ఉమేష్ యాదవ్ బౌలింగ్. నాలుగో బంతి...141 కి.మీ. వేగంతో సంధించాడు. ఆ బంతిని ఓ కీఫీ కట్ చేద్దామనుకున్నాడు. బ్యాట్ అంచును తాకి సాహా, ఫస్ట్ స్లిప్‌లో ఉన్న కోహ్లీ మధ్య నుంచి వెళ్ళిపోతోందనుకున్నారు. ఇంతలో సాహా బంతిపైకి లంఘించి.. గాల్లోనే ఉండి ఒడిసిపట్టాడు. పక్కనున్న కోహ్లీ ఆశ్చర్యపోయాడు. సాహాను గట్టిగా హత్తుకుని అభినందించాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే ఉమేష్ ‘హ్యాట్సాఫ్ సాహా’ అని కొనియాడాడు. రోహిత్ శర్మ ‘ఫ్లయింగ్ సాహా’ అని అభివర్ణించాడు. ఆకాష్ చోప్రా, మహ్మద్ కైఫ్, దీప్ దాస్ గుప్తా సహా ఎందరెందరో సోషల్ మీడియాలో సాహాపై ప్రశంసల జల్లు కురిపించారు.