శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : గురువారం, 27 జూన్ 2019 (12:12 IST)

ఆ సెంటిమెంట్ పునరావృతమైతే పాకిస్థాన్‌దే క్రికెట్ వరల్డ్ కప్!

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌ను ఈ దఫా పాకిస్థాన్ కైవసం చేసుకుంటుందట. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు బల్లగుద్ది వాదిస్తున్నారు. పైగా, 1992లో నాటి సెంటిమెంట్‌ను వారు గుర్తుచేస్తున్నారు. 
 
1992లో జరిగిన ఐసీసీ వరల్డ్ క్రికెట్ కప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఆ దేశ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యం వహించారు. ఆ టోర్నీలో పాకిస్థాన్ జట్టు తొలి మ్యాచ్‌లో ఓడింది. రెండో మ్యాచ్ గెలిచింది. మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. నాలుగు, ఐదు మ్యాచ్‌లలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో పాకిస్థాన్ జట్టు సెమీస్‌ ఆశలను వదులుకుంది.
 
ఈ క్రమంలో చావోరేవో స్థితిలో ఆరో మ్యాచ్ ఆరో మ్యాచ్ ఆడిన ఇమ్రాన్ సేన.. విజయభేరీ మోగించింది. ఈ విజయంతో ఏడో మ్యాచ్‌లోనూ గెలుపొందింది. కానీ ఆరో మ్యాచ్‌లో విజయభేరీ మోగించింది. అదే ఊపును ఏడో మ్యాచ్‌లోనూ కొనసాగించి, చివరకు ప్రపంచ కప్‌ను ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఎగరేసుకుని పోయింది. 
 
ఇక ప్రస్తుత మ్యాచ్‌లలోనూ పాకిస్థాన్ ఆటతీరు ఇదే విధంగా ఉంది. 1992లో పాకిస్థాన్ ఆటతీరు ఏవిధంగా ఉన్నదో అదే విధంగా ఇపుడు కూడా పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్భరాజ్ అహ్మద్ ఆటతీరు కూడా ఉంది. దీంతో సెంటిమెంట్ పునరావృతమైతే ఈ దఫా వరల్డ్ కప్ విశ్వవిజేతగా తమ దేశం అవతరించడం ఖాయమని పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ జోస్యం చెపుతున్నారు.