గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : ఆదివారం, 16 జూన్ 2019 (16:43 IST)

మాంచెష్టర్‌లో మంచు లక్ష్మి సందడి... వికెట్ కోల్పోయిన భారత్

ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్‌లను తిలకించేందుకు భారత్‌కు చెందిన అనేక మంది సెలెబ్రిటీలు విదేశాలకు వెళుతుంటారు. ఇలా టాలీవుడ్‌కు చెందిన నటి మంచు లక్ష్మి కూడా ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు వెళ్లింది. ఆదివారం మాంచెష్టర్ వేదికగా భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ మ్యాచ్‌ కోసం ఆమె ఓల్డ్‌ట్రాఫోర్డ్ మైదానికి వెళ్లి సందడి చేశారు. భారత బ్యాట్స్‌మెన్లు ఫోర్లు, సిక్సర్లు కొట్టినపుడల్లా ఆమె త్రివర్ణ పతకాలను ఊపుతూ భారత ఆటగాళ్ళను ప్రోత్సహించారు. 
 
మరోవైపు, భారత తన తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ తన వ్యక్తిగత స్కోరు 57 పరుగుల వద్ద ఔటౌయ్యాడు. ఈయన మొత్తం 78 బంతులు ఎదుర్కొని 57 పరుగులు చేయగా, ఇందులో రెండు సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. అలాగే, మరో ఓపెనర్ రోహిత్ శర్మ 80 పరుగులతో అజేయంగా క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం క్రీజ్‌లోకి కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 24.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 143 పరుగులు చేసింది.