శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 జూన్ 2023 (11:24 IST)

మమ్మీడాడీలకు తమ్ముడంటేనే అమిత ఇష్టమనీ.....

హర్యానా రాష్ట్రంలోని బల్లభ్‌ఘడ్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. సొంత తమ్ముడిని గొంతు నులిమి చంపేసిందో మైనర్ బాలిక (చెల్లి). వీర్దదరూ వేసవి సెలవుల కోసం హర్యానాలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. అక్కడ క్షణికావేశంలో ఆ బాలిక ఈ దారుణానికి పాల్పడింది.  
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తమ నానమ్మ, తాతయ్యల వద్ద ఉంటూ వచ్చిన ఈ అక్కాతమ్ముడు.. వేసవి సెలవుల కోసం హర్యానా రాష్ట్రంలోని తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. అయితే, తమ తల్లిదండ్రులకు తనకంటే తన తమ్ముడంటేనే మంచి ఇష్టమని ఆ బాలిక మనసులో నాటుకునిపోయింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తమ్ముడితో ఉద్దేశ్యపూర్వకంగా గొడవ పెట్టుకుని, గొంతు నులిమి హత్య చేసింది. 
 
హర్యానాకు వెళ్లగానే తల్లిదండ్రులు తమ కుమారుడికి ఓ మొబైల్ ఫోన్ కొనిచ్చారు. అయితే, మంగళవారం బాలుడు ఫోనులో గేమ్ ఆడుకుంటుండగా, తనకూ కాసేపు ఫోన్ ఇవ్వమని బాలిక అడిగింది. అందుకు బాలుడు నిరాకరించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ బాలిక క్షణికావేశంలో తమ్ముడిని గొంతు నులిమి హత్య చేసింది. 
 
ఆ తర్వాత ఇంటికొచ్చిన బాలిక తల్లిదండ్రులు నిర్జీవంగా పడివున్న కుమారుడిని చూసి నిర్ఘాంతపోయారు. దీనిపై కుమార్తెను ప్రశ్నించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.