గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2024 (08:54 IST)

యువకుడి ప్రాణాలు తీసిన ఎయిర్ బ్లోయర్!!

deadbody
కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ఓ విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ బ్లోయర్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన బెంగుళూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరంలోని సంపెగహళ్లి ప్రాంతానికి చెందిన యోగేశ్ (24), మార్చి 25వ తేదీన స్థానిక వాషింగ్ సెంటర్‌లో పని చేస్తున్న తన స్నేహితుడు మురళి వద్దకు వెళ్లాడు. సర్వీసింగ్ కోసం తన బైక్‌ను అతడికి ఇచ్చాడు. ఆ తర్వాత బండిపై నీటిని తొలగించే హాట్ యెయిర్ బ్లోయర్‌తో ఇద్దరూ ఆటలు ప్రారంభించారు. 
 
తొలుత మురళి ఎయిర్‌ బ్లోయర్‌తో యోగేశ్ ముఖంపై గాలి కొట్టాడు. ఆ తర్వాత అతడిని మర్మాంగంలోకి బ్లోయర్ నాజిల్‌ను చొప్పించి ఆన్ చేశాడు. దీంతో యోగేశ్ కడుపు ఒక్కసారిగా ఉబ్బిపోయి అతడు కూలబడిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఆపరేషన్ చేశారు. చివరకు అతడి ఆరోగ్యం మరింత విషమించి ప్రాణాలు కోల్పోయాడు. కాగా, నిందితుడు మురళీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.