ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 డిశెంబరు 2024 (08:45 IST)

ప్రిన్సిపాల్ కాల్చి చంపిన విద్యార్థి.. మృతుడి బైకుపైనే పరారీ...

gunshot
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ విద్యార్థి పాఠశాల హెడ్మాస్టర్‌ (ప్రిన్సిపాల్)ను కాల్చి చంపేశాడు. ఆ తర్వాత మృతుడు బైకుపైనే పారిపోయాడు. తలకు గురిపెట్టి కాల్చడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతుడుని సురేంద్ర కుమార్ సక్సేనా (55)గా గుర్తించారు. ధమోరా ప్రభుత్వం హయ్యర్ సెకండరీ పాఠశాలలో హెచ్.ఎంగా పని చేస్తున్నారు. అయినా బాత్రూంలో రక్తపు మడుగులో పడి విగతజీవిగా ఉన్న స్థితిలో గుర్తించారు. 
 
సక్సేనా బాత్రూమ్‌కు వెళ్లిన సమయంలో ఆయన వెనుకనే వెళ్లిన ఓ విద్యార్థి తలకు గురిపెట్టి కాల్చాడు. దీంతో ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పాఠశాలలో తుపాకీ మోత వినిపించడంతో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు హడలిపోయారు. నిందితుడైన 12వ తరగతి విద్యార్థి.. మృతుడు బైకుపైనే పారిపోయాడు. 
 
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పారిపోయిన నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, నిందితుడుతో కలిసి మరో విద్యార్థి కూడా పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో వారిద్దరి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.