శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 నవంబరు 2024 (12:35 IST)

'నువ్వు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే'.. కొడుకు క్రికెట్ బ్యాటుతో కొట్టి చంపిన తండ్రి... ఎక్కడ?

murder
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. కన్న కుమారుడుని క్రికెట్ బ్యాటుతో కొట్టి చంపేశాడో కన్నతండ్రి. స్కూలుకు సరిగా వెళ్ళలేదు కాదు కాదా.. మొబైల్ ఫోన్ రిపేరు చేయించుకునేందుకు డబ్బుులు అడగడంతో ఆ తండ్రికి కోపం నషాళానికి ఎక్కింది. చదువుకుని గొప్పవాడివి కావాలని మేం కష్టపడి స్కూలుకు పంపిస్తుంటే, స్కూలుకు వెళ్లకుండా నువ్వు చేస్తున్నదేంటని అడుగుతూ కొట్టడం మొదలు పెట్టాడు. కోపంలో విచక్షణ మరిచిపోయి క్రికెట్ బ్యాట్‌తో తీవ్రంగా కొట్టాడు. గోడకేసి కొట్టడంతో కొడుకు తల పగిలింది. తీవ్ర గాయాల కారణంగా ఆ బాలుడు అక్కడే చనిపోయాడు. శుక్రవారం ఉదయం ఈ విషాదకర ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. 
 
పోలీసుల కథనం మేరకు.. కాప్నినగర్‌‍కు చెందిన రవికుమార్ (40) కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య శశికళ, కొడుకు తేజస్ (14) ఉన్నారు. తేజస్ స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే, క్లాసులకు సరిగా వెళ్లకుండా ఎప్పుడు చూసినా మొబైల్‌తో ఆటలాడుతూ కనిపిస్తున్నాడని రవికుమార్ కొడుకును తిడుతుండేవాడు. 
 
తాము కష్టపడి చదివిస్తుంటే కొడుకు చదువును నిర్లక్ష్యం చేయడం తట్టుకోలేకపోయేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం మొబైల్ ఫోన్ రిపేర్ కోసం డబ్బులు కావాలని అడిగిన తేజస్‌పై రవికుమార్ తీవ్రంగా మండిపడ్డాడు. ఇంట్లోని క్రికెట్ బ్యాట్‌తో కొడుకును కొట్టాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన భార్యపైనా మండిపడ్డాడు. 
 
అప్పటికీ కోపం తగ్గక 'నువ్వు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే' అంటూ కొడుకు తలపై కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి తేజస్ స్పృహ కోల్పోయాడు. కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా రవికుమార్ అడ్డుకున్నాడు. తేజస్‌ను అలాగే వదిలేసి కాసేపటి తర్వాత బయటకు వెళ్లిపోయాడు. ఎంతసేపటికి లేవకపోవడంతో చుట్టుపక్కల వారి సాయంతో శశికళ తన కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లింది.
 
అయితే, గాయాలు, రక్తస్రావం కారణంగా తేజస్ అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసి ఆసుపత్రికి వచ్చిన రవికుమార్.. కొడుకుది సాధారణ మరణమేనని చెప్పి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టాడు. ఇది చూసి శశికళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి రవికుమార్‌‍ను అదుపులోకి తీసుకున్నారు. తేజస్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.