శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 నవంబరు 2024 (15:03 IST)

సంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు.. నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపేశాడు.. (video)

murder
సంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు కలకలం రేపింది. ఓ వ్యక్తి నడిరోడ్డుపైనే పాత కక్షలతో తల్లీకొడుకులను కత్తితో పొడిచి చంపేశాడు. గుమ్మడిదల మండలం బొంతపల్లిలోని వీరభద్రకాలనీలో ఈ ఘటన జరిగింది. 
 
బీహార్ రాష్ట్రానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి తల్లీకొడుకలను కత్తితో పొడిచి చంపేశాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
మృతులు యూపీకి చెందిన సరోజాదేవి (50), అనిల్ (30)గా గుర్తించారు. కాగా, పాత గొడవలే హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. తన రెండేళ్ల కొడుకు చావుకు వీరు కారణమని అందుకే వారిని చంపినట్లు నిందితుడు నాగరాజు చెబుతున్నట్లు తెలుస్తోంది.
 
తన భార్యపై కూడా మృతులిద్దరూ దాడి చేసేందుకు ఇంట్లోకి వచ్చినట్లు ఆరోపించాడు. కొడుకు చనిపోయిన రెండేళ్ల తర్వాత కక్ష పెంచుకుని ఈ రోజు కత్తితో దాడి చేయడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తు జరుగుతోంది.