బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 జనవరి 2024 (16:04 IST)

భార్యను బీచ్‌కు తీసుకెళ్లి.. సముద్రపు నీటిలో ముంచి చంపేసిన భర్త.. ఎక్కడ?

murder
భార్యను విహార యాత్ర కోసం బీచ్‌కు తీసుకెళ్లిన భర్త.. ఆమెను సముద్రపు నీటిలో ముంచి చంపేశాడు. ఈ దారుణం ఘటన దక్షిణ గోవా జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దక్షిణ గోవాకు చెందిన నిందితుడు గౌరవ్ కటియార్ (29) తన భార్య దీక్షా గంగ్వార్ (27)ను కాబో డి రామా బీచికి తీసుకెళ్లి అక్కడామెను నీళ్లలో ముంచి చంపేశాడు. అయితే, ఈ ఘటనను వీడియో తీసిన ఓ వ్యక్తి దానిని బయటపెట్టడంతో దారుణం వెలుగులోకి వచ్చింది.
 
శుక్రవారం మధ్యాహ్నం దీక్షా గంగ్వార్ మృతదేహాన్ని పోలీసులు బీచ్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. దీక్షతో వివాహేతర సంబంధం నెరిపిన కటియార్ ఏడాది క్రితం ఆమెను వివాహం చేసుకున్నాడు. శుక్రవారం షికారు కోసమని భార్యను తాను పనిచేస్తున్న హోటల్ సమీపంలోని బీచ్‌ తీసుకెళ్లిన కటియార్ అక్కడామెను నీళ్లలో ముంచి చంపేశాడు.
 
ఆ తర్వాత తన భార్య ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, స్థానికుడు ఒకడు కటియార్‌కు తెలియకుండానే ఈ ఘటనను చిత్రీకరించడంతో అతడి నేరం వెలుగులోకి వచ్చింది. కటియార్, దీక్ష ఇద్దరిదీ లక్నో అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.