మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 జనవరి 2024 (14:10 IST)

జనవరి 22న రామ మందిరం ప్రాణ ప్రతిష్ట... చెర్రీ దంపతులకు ఆహ్వానం

upasana_Ramcharan
upasana_Ramcharan
జనవరి 22న మందిరంలోని రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. లక్షకు పైగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రామాలయం కాంప్లెక్స్ ను 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ఆలయంలోని ప్రతి ఫ్లోర్ 20 అడుగుల ఎత్తు ఉంటుంది. 44 ద్వారాలు, 392 పిల్లర్లతో ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసనలకు ఆహ్వానం అందింది.  ఆరెస్సెస్ నేత సునీల్ అంబేద్కర్ హైదరాబాద్ లోని రామ్ చరణ్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 8 వేల మంది ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.  
 
అయోధ్యలో ఈ నెల 22న రామ మందిర్ ప్రారంభోత్సవం, ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశమంతా రామ నామ స్మరణ చేయనుంది. అయోధ్య నగరం ఇప్పటికే ముస్తాబవగా.. విదేశాల్లోనూ వేడుకలు జరుగుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠకు ముందురోజు పారిస్ లో ఈఫిల్ టవర్ వద్ద రామ రథయాత్ర కార్యక్రమం చేపట్టనున్నట్లు అక్కడి హిందువులు తెలిపారు. అగ్రరాజ్యం అమెరికాలోని హిందువులు అక్కడి నుంచే సంబరాలు జరుపుకోనున్నారు.