సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 2 జనవరి 2024 (17:38 IST)

చిన్ననాటి మిత్రులతో నూతన ఏడాది వేడుక జరుపుకున్న రామ్ చరణ్

Ram Charan childhood friends
Ram Charan childhood friends
సినిమా స్టార్ లంతా డిసెంబర్ 31 న తమ కుటుంబసభ్యులతో వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. మరికొందరు జనవరి 1 న సరికొత్తగా కలుసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తాజాగా ఆ జాబితాలో రామ్ చరణ్ జేరాడు. నిన్న సాయంత్రం తన చిన్ననాటి మిత్రులతో కొద్దిమందినికలిసి సంతోషాన్ని పంచుకున్నారు. వారి కలయికకు బ్లాక్ కోడ్ పెట్టుకున్నారు. అందరూ ఏదోరకంగా ఇంచుమించు బ్లాక్ డ్రెస్ వేసుకోవడం విశేషం.
 
వృత్తిపరంగా చూసుకుంటే, రామ్ చరణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ "గేమ్ ఛేంజర్"తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు.  అనంతరం వాస్తవ జీవిత సంఘటనల ఆధారంగా బుచ్చి బాబు సనా  దర్శకత్వంలో ఓ చిత్రంలో కనిపించబోతున్నాడు, కుటుంబ జీవితం పట్ల అతని నిబద్ధతతో పాటు డ్యూటీ నైపుణ్యంలోనూ  అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నాడు.