బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (17:20 IST)

తాడేపల్లిలో దారుణం : మద్యంమత్తులో అంధురాలైన యువతి నరికివేత

murder
గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో అంధురాలైన ఓ యువతిని ఓ కిరాతకుడు అతి దారుణంగా నరికివేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అదే ప్రాంతానికి చెందిన రాజు అనే దుండగుడు కత్తితో దాడి చేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తాడేపల్లిలోని ఎన్టీఆర్ కట్ట ప్రాంతానికి చెందిన రాజు అనే వ్యక్తి గంజాయి మత్తులో ఆదివారం రాత్రి ఒంటరిగా ఉన్న యువతి ఇంటికి వెళ్లి, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులతో పాటు స్థానికులు కలిసి రాజును మందలించడంతో కక్ష పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి యువతిపై కత్తితో దాడి చేసి నరికివేశాడు. ఆ తర్వాత దండగుడు నేరుగా డీఎస్పీ వద్దకు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో జరగడం గమనార్హం. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నా పోలీసులు మాత్రం చూసీచూడనట్టుగా వదిలివేసి, చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.