మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 28 ఆగస్టు 2021 (12:13 IST)

భార్యపై స్నేహితుడితో అత్యాచారం చేయించిన భర్త

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అవి తారాస్థాయికి వెళ్లడంతో ఇక తన భర్తతో కలిసి బ్రతకడం సాధ్యం కాదని నిర్ణయించుకున్న భార్య విడాకుల కోసం కోర్టులో పిటీషన్ వేసింది. తనపై భార్య ఫిర్యాదు చేయడంతో రగిలిపోయాడు భర్త. తన స్నేహితులు ముగ్గుర్ని వెంటబెట్టుకుని వెళ్లి వారితో అత్యాచారం చేయించాడు.
 
పూర్తి వివరాలు చూస్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథి జిల్లాలో బజార్ శుక్లా పోలీసు స్టేషను పరిధిలో ఓ వివాహిత భర్తతో గొడవల కారణంగా విడాకులకు దరఖాస్తు పెట్టుకుంది. భార్య తనపై ఫిర్యాదు చేసిందన్న ఆగ్రహంతో ఆమె భర్త ఈ నెల 24న తన ముగ్గురు స్నేహితులను వెంటబెట్టుకుని భార్య వుంటున్న ఇంటికి వెళ్లాడు.
 
ఆ సమయంలో ఇంట్లో ఆమె ఒక్కతే ఒంటరిగా వుండటంతో దాడి చేసారు. ఆ తర్వాత ఆమెపై తన స్నేహితుడితో అత్యాచారం చేయించాడు. తనకు నరకం చూపించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తనను పెట్రోల్ పోసి తగలపెట్టేందుకు ప్రయత్నించారనీ, తను గట్టిగా కేకలు వేయడంతో పారిపోయారని వివరించింది.
 
ఐతే ఆమె ఫిర్యాదును స్థానిక పోలీసులు పట్టించుకోలేదనీ, చివరికి అమేథీ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయగా వారు స్పందించారని చెప్పింది.