శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 మార్చి 2022 (20:06 IST)

మత్తుమందు ఆరగించి యువకుడు మృతి

హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఓ యువకుడు మత్తుమందు తీసుకుని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీన్ని డ్రగ్స్ తీసుకుని ప్రాణాలు తీసుకుని ఆత్మహత్య చేసుకున్న తొలి కేసుగా నమోదు చేశామని శాంతిభద్రత విభాగం అదనపు కమిషనర్ డీఎస్ చౌహన్ వెల్లడించారు. 
 
హైదరాబాద్ నగరంలోని నల్లకుంట శివమ్ రోడ్, జూబిలీహిల్స్ ప్రాంతాల్లో డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ డీఎస్ చౌహన్ వివరాలు వెల్లడించారు. 
 
నల్లకుంట శివమ్ రోడ్‌లో నివసిస్తున్న ప్రేమ్ ఉదయ్ కుమార్ అనే యువకుడు రియల్ ఎస్టేట్ చేస్తుండేవాడు. ఇటీవల శ్రీరామ్ అనే యువకుడితో కలిసి ప్రేమ్ ఉదయ్ డ్రగ్స్ దందా మొదలుపెట్టాడు. డ్రగ్స్ అతిగా తీసుకోవడంతో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో రామకృష్ణ, జీవన్ రెడ్డి, నిఖిల్ జోషూవ్ అనే కొందరు యువకులు ప్రేమ్ ఉదయ్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 
 
కెమికల్ బ్యాగ్రౌండ్ లేకున్నా శ్రీరామ్ డ్రగ్స్ తయారు చేయడం నేర్చుకున్నాడని.. శ్రీరామ్ తెలివితేటలను ప్రేమ్ డ్రగ్స్ తయారు చేయడానికి ఉపగించాడని, వీరిద్దరూ కలిసి కెమికల్ ప్రాసెస్ ద్వారా డ్రగ్స్ తయారీకి అమెజాన్ లాంటి కొరియర్ సర్వీసులను ఉపయోగించుకున్నట్లు ఏసీపీ డీఎస్ చౌహన్ వివరించారు. డ్రగ్స్ తయారు చేయడంలో ఆరితేరిన అయిన శ్రీరామ్ ఒక ఇల్లీగల్ డ్రగ్ ప్రోడక్ట్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
 
డ్రగ్స్ వినియోగదారులు రామకృష్ణ, జీవన్ రెడ్డి, నిఖిల్ జోషూవ్‌లను అరెస్ట్ చేసామన్న ఏసీపీ డీఎస్ చౌహన్… డ్రగ్స్ ప్రధాన సూత్రధారి లక్ష్మీపతి పరారీలో ఉన్నాడని త్వరలోనే అతణ్ణి పట్టకుంటామని తెలిపారు. నిందితుల నుంచి ఎల్ఎస్‌డి 6 బాటిల్స్, ఎక్స్‌టీసీ పిల్స్ 10 , హాష్ ఆయిల్ 100 గ్రాములు, నాలుగు మోబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వివరించారు. ఈ సందర్భంగా ఆసీఫ్ డీఎస్ చౌహన్ మాట్లాడుతూ డ్రగ్స్ ఎవరూ వాడొద్దని, ఒకసారి వాటికీ అలవాటు పడితే జీవితం నాసమేనని అన్నారు.