ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)
ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాలకు బలైపోతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం బంగారు పేటకు చెందిన ఓ తాపీమేస్త్రీ కూడా ఇలాగే ఆన్ లైన్ బెట్టింగ్ మోసానికి బలైపోయినట్లు వెల్లడించాడు.
పూర్తి వివరాలు చూస్తే.. కొవ్వూరు మండలం బంగారుపేటకు చెందిన తాపీమేస్త్రీ సతీష్ ఆన్ లైన్ బెట్టింగ్ చేసాడు. ఇందులో అతడు తీవ్రంగా నష్టపోయాడు. దీనితో అతడు సెల్పీ వీడియో తీసి తమ్ముడికి పంపాడు.
అందులో అతడు మాట్లాడుతూ... తమ్ముడూ, ఆన్ లైన్ బెట్టింగులో బాగా నష్టపోయాను. అందుకే చనిపోవాలని అనుకుంటున్నా. అందరూ నన్ను క్షమించండి." అంటూ పేరుపాలెం బీచ్ నుంచి తమ్ముడికి సెల్పీ వీడియో పంపాడు. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసేసాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడి కోసం గాలింపుచర్యలు చేపట్టారు.