శనివారం, 25 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated: సోమవారం, 23 జనవరి 2023 (09:20 IST)

లైవ్ పార్టనర్ కుమార్తెపై అత్యాచారం.. వ్యక్తి అరెస్టు

victimboy
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌తో ఓ వ్యక్తిని ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. తనతో సహజీవనం చేస్తున్న మహిళ కుమార్తెపై గత యేడాది కాలంగా అత్యాచారం చేస్తున్నందుకుగాను పోలీసులు అరెస్టు చేశారు. నాగ్‌పూర్‌లోని వథోడా ఏరియాకు చెందిన 37 యేళ్ల వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
నాగ్‌పూర్ హుద్‌కేశ్వర్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు గత 2022 అక్టోబరు నుంచి 32 యేళ్ల మహిళ, ఆమె 12 యేళ్ల కుమార్తెతో కలిసి ఉంటున్న 37 యేళ్ల వ్యక్తి.. మహిళ పనికి వెళ్లిన తర్వాత మైనర్ బాలికను లైంగికంగా వేధిస్తూ అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ తంతు గత యేడాది కాలంగా సాగుతోంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆ బాలిక నోరు మెదపలేదు. 
 
చివరకు తనపై జరుగుతున్న అత్యాచారాన్ని ఆ బాలిక కన్నతల్లి దృష్టికి తీసుకెళ్లింది. ఆ తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు.